Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్

Sensex looses more than 1000 points

  • బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులకు భారీ నష్టాలు
  • 1,053 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 333 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,053 పాయింట్లు నష్టపోయి 70,370కి పడిపోయింది. నిఫ్టీ 333 పాయింట్లు కోల్పోయి 21,238కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (4.05%), భారతి ఎయిర్ టెల్ (3.37%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.10%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.27%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.13%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.87%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.19%), హిందుస్థాన్ యూనిలీవర్ (-3.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.45%), బజాజ్ ఫైనాన్స్ (-3.16%)

More Telugu News