Saindhav: అమెజాన్ ప్రైమ్ లో 'సైంధవ్' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..!

  • ఈ నెల 13న రిలీజైన 'సైంధవ్'
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా 
  • థియేటర్ల నుంచి ఆశించిన స్థాయిలో రాని రెస్పాన్స్ 
  • ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమింగ్   
Saindhav Movie Update

వెంకటేశ్ కథానాయకుడిగా 'సైంధవ్' సినిమా తెరకెక్కింది. సంక్రాంతి పండగ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. ఈ నెల 13వ  తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ కంటెంట్ తో పండగ రోజుల్లో రావడం వలన ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. 

అలాంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు 15 కోట్లతో దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి చివరిలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలనుకున్నారట. అయితే ఆశించిన స్థాయికి ఈ సినిమా అందుకోకపోవడం వలన, ఫిబ్రవరి 2వ తేదీనగానీ .. 9వ తేదీన గాని స్ట్రీమింగ్ చేయవచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.

తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన కథ ఇది. అలాగే మాఫియాను టచ్ చేస్తూ నడిచే సినిమా ఇది. వెంకటేశ్ ఈ తరహా జోనర్లో చేయడం చాలా తక్కువనే చెప్పాలి. కెరియర్ పరంగా ఇది 75వ సినిమా. అందువల్లనే ఈ కంటెంట్ ను ఎంచుకున్నట్టుగా ఆయన చెప్పాడు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి. 

More Telugu News