Muslim boy: ప్రాణప్రతిష్ఠ సమయంలో పుట్టిన బిడ్డకు రాముడి పేరు పెట్టిన ముస్లిం మహిళ

  • బిడ్డకు రామ్ రహీమ్ అంటూ నామకరణం
  • ప్రాణప్రతిష్ఠ ముహూర్త సమయంలో డెలివరీ
  • ఒక్క కాన్పూర్ లోనే 25 మంది మహిళలకు ప్రసవం
Muslim boy named As Ram Rahim in Uttar Pradesh

అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండగా పుట్టిన బిడ్డకు రాముడి పేరు కలిసి వచ్చేలా నామకరణం చేసిందో ముస్లిం జంట.. తమ బిడ్డకు ‘రామ్ రహీమ్’ అంటూ పేరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన ఫర్జానా సోమవారం మధ్యాహ్నం మగ బిడ్డకు జన్మనిచ్చింది. దేశమంతా అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ సంబరాల్లో మునిగి ఉండడం, ముహూర్త సమయంలోనే తనకు నార్మల్ డెలివరీ కావడంతో పుట్టిన బిడ్డకు రాముడి పేరు పెట్టుకున్నట్లు ఫర్జాన చెప్పింది.

రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్ణయించిన ముహూర్తం దివ్యమైందనే భావనతో దేశవ్యాప్తంగా పలువురు గర్భిణీలు పట్టుబట్టి సిజేరియన్ చేయించుకున్నారు. కొంతమందికి మాత్రం ముహూర్త సమయానికే నార్మల్ డెలివరీ అయింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోనే సోమవారం 25 మంది గర్భిణిలు ప్రసవించారు. వీరిలో 10 మంది అమ్మాయిలు, 15 మంది అబ్బాయిలు వున్నారని.. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అబ్బాయిలకు రాముడి పేరు, అమ్మాయిలకు సీత పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకున్నారని వైద్యులు చెప్పారు.

More Telugu News