Vizag: సముద్రం అడుగున శ్రీ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ.. విశాఖలో అద్భుతం

  • సముద్రంలో 22 అడుగుల లోతున రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ
  • విశాఖ రిషికొండ బీచ్‌ వద్ద అబ్బురపరిచిన దృశ్యం
  • లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
Vizag scuba divers perform underwater consecration

నిన్నటి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రామభక్తులు పలు పూజలు ఇతర క్రతువులు నిర్వహిస్తూ రాములవారిపై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఇక విశాఖకు చెందిన స్కూబా డైవర్లు ఏకంగా సముద్రం అడుగున రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రిషికొండ బీచ్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 

సముద్రంలో 22 అడుగుల లోతున అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాముడిపై బలమైన విశ్వాసం, సంప్రదాయానికి ఈ కార్యక్రమం చిహ్నమని స్కూబా డైవర్లు పేర్కొన్నారు. భక్తిపారవశ్యపు అలల్లో తమ మనసు ఓలలాడిందని వారు వ్యాఖ్యానించారు. 

ఈ కార్యక్రమంలో తమ సంస్థకు చెందిన మొత్తం ఐదుగురు స్కూబా డైవర్లు పాలుపంచుకున్నట్టు లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ ఫ్రాంటియర్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయుడు తెలిపారు. ఫోమ్ బోర్డుపై ఏర్పాటు చేసిన రాముడి చిత్రపటంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, చిత్రపటంపై పూల రేకులు, ఆక్సిజన్ బబుల్స్ కురిపించామని చెప్పారు.

More Telugu News