Ayodhya Ram Mandir: ఇది నవభారతం.. మానవత్వమే అతిపెద్ద మతం: రామమందిర ప్రారంభోత్సవానికి వచ్చిన ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి

  • తమకు దేశమే తొలి ప్రాధాన్యమన్న ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్
  • ఇదొక చారిత్రాత్మక ఘట్టమన్న ఆయుష్మాన్ ఖురానా
  • రామమందిర ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలన్న నటుడు
Imam Umer Ahmed Ilyasi On Ram Mandir Consecration Ceremony

ఇది నవభారత ముఖచిత్రం... మన అతిపెద్ద మతం మానవత్వమే... మాకు దేశమే తొలి ప్రాధాన్యమని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయనకు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆహ్వానం పలికింది. ఈ మేరకు ఆయన రామాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇది సరికొత్త భారతం... ఉత్తమ భారతమని వ్యాఖ్యానించారు.

అయోధ్య బాలరాముడి ప్రారంభోత్సవంలో బాలీవుడ్ నటుడు, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇదొక చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ వేడుకకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రామమందిర ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలన్నారు.

More Telugu News