Ayodhya Ram Mandir: అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకపై చిరంజీవి ఏమన్నారంటే...!

Chiranjeevi about their experience at Ayodhya Ram Mandir
  • బాలరాముని ప్రాణప్రతిష్ఠ గొప్ప అనుభూతిని ఇచ్చిందన్న చిరంజీవి
  • దేశంలోని ప్రజలందరికీ మరిచిపోలేని రోజు అన్న మెగాస్టార్
  • శ్రీరాముడి విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యానన్న వివేక్ ఒబెరాయ్

అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది దేశంలోని ప్రజలందరికీ ఓ మరిచిపోలేని రోజు అన్నారు. అయోధ్య రామమందిరానికి రావడం తనకు ఓ గొప్ప అనుభూతి అన్నారు.

శ్రీరాముడి విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యాను: వివేక్ ఒబెరాయ్

శ్రీరాముడి విగ్రహాన్ని చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అన్నారు. బాలరాముడి విగ్రహం చాలా అందంగా ఉందన్నారు. విగ్రహాన్ని చూస్తే రాముడిని చూస్తున్న అనుభూతి కలుగుతోందన్నారు. ప్రతి కుటుంబానికి ఆయన ఆశీస్సులు కోరుకుంటున్నానన్నారు.

  • Loading...

More Telugu News