Hanu Man: 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన 'హను మాన్'

  • ఈ నెల 12న విడుదలైన 'హను మాన్'
  • హనుమంతుడి నేపథ్యంలో నడిచే కథ 
  • తొలి రోజునే దక్కిన హిట్ టాక్ 
  • 10 రోజుల్లో 200 కోట్ల వసూళ్లు 
  • ఇంకా కొనసాగుతున్న జోరు  

Hanu Man Movie Update

సంక్రాంతి కానుకగా ఈ సారి బరిలోకి దిగిన సినిమాలలో 'హను మాన్' ఒకటి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదలైంది. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అనుదీప్ దేవ్ - గౌరహరి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, మూడు పెద్ద సినిమాలతో తలపడటం విశేషం. 

తొలిరోజున తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. చాలా వేగంగా భారీ వసూళ్లను రాబడుతూ ఆశ్చర్య పరిచింది. 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి ఈ సినిమాకి ఎక్కువ సమయం పట్టలేదు. నిన్నటితో ఈ సినిమా 10 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సౌత్ లోనే కాదు నార్త్ లోను ఈ సినిమా తన జోరు చూపిస్తూ ఉండటం విశేషం. 

ఒక గిరిజన గూడానికి చెందిన యువకుడికి హనుమంతుడి అనుగ్రహం కలిగిన దివ్యమణి దొరుకుతుంది. ఆ దివ్యమణి వలన అతను మహాశక్తిమంతుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న విలన్, ఆ దివ్యమణిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అతని కారణంగా హీరో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? అనేదే కథ.

More Telugu News