Ram Lalla idol: బాల రాముడి విగ్రహం విశేషాలు.. వీడియో ఇదిగో!

  • అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు
  • స్వర్ణ, వజ్రాభరణాలతో సుందర రూపం
  • నల్లరాతితో ఐదేళ్ల బాల రాముడికి ప్రతిరూపంగా చెక్కిన శిల్పి
8 things to know about the Ram Lalla idol

అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. రామమందిరంలో బాల రాముడు కొలువుదీరాడు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువును పూర్తిచేశారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత బాల రాముడి సుందర రూపాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు బాల రాముడిని కనులారా దర్శించుకున్నారు. బాల రాముడి విగ్రహానికి సంబంధించిన కొన్ని విశేషాలు..

  • నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ ఇది. నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు.
  • బాల రాముడి విగ్రహాన్ని స్వర్ణ, వజ్రాభరణాలతో అలంకరించారు. రాజకుటుంబ ఠీవీని ప్రదర్శించేలా ఆభరణాలతో అలంకరించారు.
  • రాముడిని ఐదేళ్ల బాలుడి రూపానికి తగ్గట్లుగా, ఆ వయసులో కనిపించే అమాయకత్వం ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు.
  • ఐదేళ్ల బాలుడి ఎత్తుకు కాస్త అటూఇటుగా 51 ఇంచుల విగ్రహం ఇది.
  • స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారుచేసి బాల రాముడి చేతిలో అలంకరించారు.
  • రాముడు ఆజానుబాహుడని రామాయణంలో వర్ణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకగా బాల రాముడి చేతులను పొడవుగా, మోకాళ్ల వరకు చేరేంత పొడవుతో తీర్చిదిద్దారు. ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు.
  • రామాయణంలో శ్రీరాముడి వర్ణనను దృష్టిలో ఉంచుకుని ఈ విగ్రహానికి రూపమిచ్చారు. అందుకే బాల రాముడి కళ్లు పద్మాలను పోలినట్లు కనిపిస్తున్నాయి.
  • బాల రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దినది కర్ణాటకకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్

More Telugu News