Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంపై ఆర్మీ హెలికాప్టర్లతో పూల వాన!

  • బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా  పూల వర్షం
  • స్వామివారికి హారతి పట్టే సమయంలో పూల వర్షం కురిసేలా ఏర్పాట్లు
  • కార్యక్రమంలో 30 మంది సంగీత కళాకారుల ప్రదర్శన
Helicopters to shower flowers on Ram mandir

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయంపై పూల వర్షం కురిపించనున్నారు. రాములోరికి హారతులు పట్టే సమయంలో ఆర్మీ హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేశారు. 

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా 30 మంది సంగీత కళాకారులు తమ ప్రతిభ చాటనున్నారు. హారతి సమయంలో అతిథులందరూ గంటలు మోగిస్తారు. 

ఈ చారిత్రాత్మక ఉత్సవంలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయ ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని ప్రసంగిస్తారు. మొత్తం 121 మంది ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటూ ఆర్ఎస్ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి సమక్షంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది.

More Telugu News