Mahesh Babu: మహేశ్‌బాబు జర్మనీ ప్రయాణం వెనక అసలు విషయం ఇదన్నమాట!

- రాజమౌళి కాంబినేషన్‌లో భారీ సినిమా చేస్తున్న మహేశ్‌బాబు
- ఇటీవల జర్మనీ వెళ్లిన టాలీవుడ్ సూపర్ స్టార్
- జర్మనీలోని ఓ హోటల్‌లో శారీరక దృఢత్వంపై శిక్షణ
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇటీవల జర్మనీ వెళ్లడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ అట్లాంటాకు చెందిన మూవీ ఫాలోవర్ క్రిస్టోఫర్ కనగరాజ్ ఓ ఫొటోను షేర్ చేశారు.
రాజమౌళి కాంబినేషన్‌లో మహేశ్ ఓ సినిమా చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఆఫ్రికన్ అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్‌స్ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైనట్టు తెలిసింది. ఈ సినిమాలో తన లుక్, మేకోవర్ కోసమే మహేశ్ జర్మనీ వెళ్లినట్టు ప్రచారం జరిగింది.
తాజాగా, జర్మనీలో ఉన్న మహేశ్‌బాబు ఫొటోను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్.. మహేశ్ ప్రస్తుతం జర్మనీలోని బ్రెన్నర్స్ పార్క్-హోటల్, స్పాలో డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో శారీరక దృఢత్వానికి శిక్షణ పొందుతున్నట్టు రాసుకొచ్చాడు.