DK Shivakumar: పూజలు, ప్రార్థనలతో ఫలితం దక్కుతుందని నేనూ నమ్ముతా: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

I also believe worship and prayers will get results says DK Shivakumar
  • నేడు సెలవు ప్రకటించాలని బీజేపే నేతల డిమాండ్
  • ఈ విషయంలో ఎవరూ తమపై ఒత్తిడి తీసుకురాలేరన్న డీకే
  • ఎవరూ చెప్పకముందే సోమవారం ఆలయాల్లో పూజలు చేయాలని ఆదేశించామన్న డిప్యూటీ సీఎం
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ రాష్ట్రంలో నేడు సెలవు ప్రకటించాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి తీసుకురాలేరని తేల్చి చెప్పారు. సిద్ధరామయ్య పేరులో రాముడు, తన పేరులో శివుడు ఉన్నారని, కాబట్టి తమపై ఒకరు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు.

భక్తి, మతం, ధర్మ ప్రచారం తాము చేయబోమని స్పష్టం చేశారు. మతం ఉండాలి కానీ, అందులో రాజకీయాలు ఉండకూడదన్నారు. ఆలయాల్లో సోమవారం పూజలు నిర్వహించాలని ఎవరూ చెప్పకముందే తాము ఆదేశించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పూజలు, ప్రార్థనలతో ఫలితం దక్కుతుందని నమ్మేవారిలో తానూ ఒకడినని చెప్పారు. సమాజ బాగుకోసం అందరూ కలిసి పూజలు, ప్రార్థనలు చేయాలని శివకుమార్ సూచించారు.
DK Shivakumar
Congress
Karnataka
BJP

More Telugu News