Allu Arjun: అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించిన మామ చంద్రశేఖర్ రెడ్డి

  • వ్యాపార రంగంలో రాణిస్తున్న స్నేహా రెడ్డి
  • హైదరాబాదులో ఫైర్ ఫ్లై కార్నివాల్ ఏర్పాటు
  • కార్నివాల్ ను సందర్శించిన స్నేహా రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి
  • అల్లు అర్జున్ యువతను ప్రోత్సహిస్తుంటాడని వెల్లడి  
Chandrasekhar Reddy lauds his son in law Allu Arjun

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్ధాంగి స్నేహా రెడ్డి వ్యాపారరంగంలో రాణిస్తున్నారు. ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అయ్యే స్నేహా రెడ్డి తాజాగా ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఫైర్ ఫ్లై కార్నివాల్ ఏర్పాటు చేశారు. హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న ఈ కార్నివాల్ లో యువ మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

స్నేహారెడ్డి కొన్నాళ్ల కిందట పికాబు అనే సంస్థను స్థాపించారు. తాజాగా తన సోదరి నాగు రెడ్డి (నాగలక్ష్మి), స్నేహితురాలు స్మిత రెడ్డిలకు చెందిన టాప్ స్టిచ్ (ఫ్యాషన్ దుస్తుల కంపెనీ)తో కలిసి కార్నివాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్నివాల్ ను స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. తన కుమార్తెలు వ్యాపార రంగంలో వినూత్న పంథాలో ముందుకెళుతుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన తన అల్లుడు అల్లు అర్జున్ గురించి చెప్పుకొచ్చారు. "మీకు తెలుసు... అల్లు అర్జున్ యువతను బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. సినిమా రంగంలోనూ యువతను పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటాడు. సహజంగానే స్నేహా రెడ్డిని కూడా బాగా ప్రోత్సహిస్తుంటాడు. స్నేహా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. పైగా విదేశాల్లో చదువుకుంది. స్నేహ, నాగలక్ష్మి వంటి వాళ్లు ఫైర్ ఫ్లై కార్నివాల్ వంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మిగతా అమ్మాయిలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు ఇంట్లో  కూర్చుంటే యువతకు ఇన్ స్పిరేషన్ ఉండదు. 

అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే... ఇవాళ ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ అని అవార్డు కూడా అందుకున్నాడు. గత 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర చూస్తే ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటులు ఉన్నారు. వాళ్లు సాధించలేనిది తను సాధించాడంటే ఎంత కఠోరంగా శ్రమించాడో, ఎంత అంకితభావంతో కృషి చేశాడో అర్థమవుతుంది. అర్జున్ లో ఉన్న లక్షణాలన్నీ ఇవాళ స్నేహలో కూడా కనిపిస్తున్నాయి. తన కంపెనీ పికాబును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఎంతో శ్రమిస్తోంది" అని చంద్రశేఖర్ రెడ్డి  వివరించారు.

More Telugu News