Swamy Nithyananda: అయోధ్య నుంచి ఆహ్వానం అందింది... వచ్చేస్తున్నా: స్వామి నిత్యానంద

  • మరోసారి తెరపైకి వివాదాస్పద గురు
  • అయోధ్యలో చారిత్రక ఘట్టం జరుగుతోందని వెల్లడి
  • అందరూ హాజరు కావాలని పిలుపు
  • గతంలో అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద
Swamy Nithyananda says he will attend Ayodhya event

వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు స్వామి నిత్యానంద మరోసారి తెరపైకి వచ్చారు. ఆయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందిందని, తాను ఈ కార్యక్రమం కోసం వస్తున్నానని నిత్యానంద వెల్లడించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దని, అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. 

అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన స్వామి నిత్యానంద... కరీబియన్ దీవులకు సమీపంలో ఓ దీవిలో మకాం ఏర్పరచుకుని, దాన్నే కైలాస దేశంగా ప్రకటించుకున్నారు. తన కైలాస దేశానికి ఐరాస గుర్తింపు కూడా ఉందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, తన దేశానికి సొంత కరెన్సీ, సొంత రిజర్వ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు.

More Telugu News