అనాథ బాలల కోసం 'గుంటూరు కారం' చిత్రాన్ని ప్రదర్శించిన ఘట్టమనేని సితార
- సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్న మహేశ్ బాబు
- తండ్రి బాటలోనే సితార
- ఏఎంబీ సినిమాస్ లో అనాథ పిల్లల కోసం స్పెషల్ స్క్రీనింగ్
మహేశ్ బాబు ముద్దుల కుమార్తె ఘట్టమనేని సితార కూడా తండ్రి బాటలోనే సామాజిక స్పృహను ప్రదర్శిస్తోంది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఈ సంక్రాంతికి రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా, అనాథ బాలల కోసం గుంటూరు కారం చిత్రాన్ని సితార ప్రత్యేకంగా ప్రదర్శించింది.
హైదరాబాద్ లోని తమ సొంత థియేటర్ ఏఎంబీ సినిమాస్ లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. మహేశ్ బాబు ఫౌండేషన్-చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ శరణాలయం పిల్లలతో కలిసి సితార గుంటూరు కారం సినిమాను వీక్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి.


