Mahesh Babu: నాన్న పాటకు సితార డ్యాన్స్.. వీడియో ఇదిగో!

Mahesh Babu Daughter Sitara Latest Dance video Goes Viral
  • గుంటూరు కారం సినిమా పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసిన సితార
  • ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిన వీడియో
  • క్యూట్ గా చేసిందంటూ మెచ్చుకుంటున్న మహేశ్ బాబు ఫ్యాన్స్
హీరో మహేశ్ బాబు కూతురు సితార మరోమారు ఇన్ స్టాలో ట్రెండింగ్ గా  మారింది. మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ డ్యాన్స్ వీడియోను సితార తన ఇన్ స్టాలో పంచుకుంది. దీంతో ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. ట్రిప్పింగ్ ట్రిప్పింగ్.. అంటూ సాగే ఈ పాటకు సితార చేసిన డ్యాన్స్ అద్బుతమంటూ మహేశ్ బాబు అభిమానులు మెచ్చుకుంటున్నారు. కామెంట్లు పెడుతూ, వీడియో షేర్ చేసుకుంటూ తమ సంతోషాన్ని తోటి అభిమానులతో పంచుకుంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార.. గతంలోనూ పలు పాటలకు డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా తన తండ్రి మహేశ్ బాబు సినిమాలలోని పలు పాటలకు సితార చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, సితార ఓ ప్రముఖ జువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గానూ వ్యవహరించారు. దీనికి సంబంధించి చేసిన ఓ యాడ్ ను న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించారు.

Mahesh Babu
Sitara Dance
Insta video
Sitara Dance video
Mahesh Babu Daughter
Gunturu Kaaram
Viral Videos
Social Media

More Telugu News