Sania Mirza: విడిపోయిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్.. పాక్ నటిని పెళ్లాడిన షోయబ్!

Sania Mirza husband Shoaib Malik marries Pakistan actress Sana Jawed
  • పాక్ నటి సనా జావెద్ ను పెళ్లాడిన షోయబ్ మాలిక్
  • ఇన్స్టా వేదికగా వెల్లడించిన షోయబ్
  • కొంత కాలంగా దూరంగా ఉంటున్న సానియా, షోయబ్
గత కొంత కాలంగా విపరీతంగా జరిగిన ప్రచారం నిజమయింది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం ముగిసింది. ఇద్దరూ విడిపోయారు. పాకిస్థాన్ నటి సనా జావెద్ ను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. సనాను పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోలో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. సానియా, షోయబ్ ఇద్దరూ కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.

ఇటీవల సానియా మీర్జా పరోక్షంగా తాము విడిపోతున్నామనే విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. 'విడాకులు బాధాకరం' అని ఆమె అన్నారు. సానియా, షోయబ్ దంపతులకు 2018 అక్టోబర్ లో ఇజాన్ అనే కొడుకు జన్మించాడు. 

ఇక సనా జావెద్ విషయానికి వస్తే... పాకిస్థాన్ లో ఆమెకు మంచి నటిగా గుర్తింపు ఉంది. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లే. సింగర్ ఉమైర్ జస్వాల్ ను 2020లో ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. వీరు విడిపోవడానికి కారణం మాత్రం ఇంత వరకు వెల్లడి కాలేదు.
Sania Mirza
Shoaib Malik
Marriage
Pakistan
Actress Sana Jawed

More Telugu News