Google: సెర్చ్ చేసేందుకు కొత్త పద్ధతి కనుగొన్న గూగుల్

  • ఏఐ సాయంతో నూతన టెక్నాలజీకి శ్రీకారం
  • త్వరలో శాంసంగ్ ఎస్24 ఫోన్ల ద్వారా లేటెస్ట్ సెర్చ్ విధానం
  • గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో మోడళ్లలోనూ కొత్త టెక్నాలజీ
Google will introduce new method to search

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన సరికొత్త సెర్చ్ విధానాన్ని గూగుల్ కనుగొంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ లో సెర్చ్ చేసేందుకు ఈ కొత్త పద్ధతి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపించే ఏదైనా ఫొటో కానీ, టెక్ట్స్ సందేశంలో కానీ మనకు కావాల్సిన అంశం చుట్టూ రౌండప్ చేస్తే చాలు... ఆ వృత్తంలోని అంశానికి సంబంధించిన సమాచారం ప్రత్యక్షమవుతుంది. ఇప్పటివరకు గూగుల్ సెర్చ్ అంటే ఏదైనా పదాలు టైప్ చేయడం, ఇమేజ్ సాయంతో సెర్చ్ చేయడం, వాయిస్ అసిస్టెంట్ ద్వారా సెర్చ్ చేయడం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడీ కొత్త విధానం ఓ సాంకేతిక విప్లవం అనొచ్చు. 

త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ చేయనున్నారు. ఈ కొత్త సెర్చ్ విధానాన్ని కూడా ఆ ఫోన్లలో పొందుపరచనున్నారు. అంతేకాదు, గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్లలోనూ ఈ సర్కిల్ సెర్చ్ అందుబాటులో ఉంటుంది.

More Telugu News