YS Sharmila: నిశ్చితార్థానికి ఊహించని దానికంటే ఎక్కువమంది వచ్చారు... అసౌకర్యానికి చింతిస్తున్నాను: షర్మిల

Sharmila thanked everey one who attends her son engagement
  • నిన్న హైదరాబాదులో షర్మిల తనయుడి  నిశ్చితార్థం
  • గోల్కొండ రిసార్ట్స్ వేదికగా శుభకార్యం
  • భారీగా తరలివచ్చిన అతిథులు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిన్న (జనవరి 18) తన కుమారుడి నిశ్చితార్థ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థానికి హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా నిలిచింది. 

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వైఎస్ కుటుంబ అభిమానులు, షర్మిల మద్దతుదారులు ఈ శుభకార్యానికి విచ్చేశారు. ఏపీ సీఎం జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు తరలివచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్నేహితులు, బంధువులు, అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు. దాంతో, చిన్నపాటి అసౌకర్యం కలిగిందని తెలిసి చింతిస్తున్నాను. నూతన వధూవరులను మంచి మనసుతో ఆశీర్వదించిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు" అంటూ షర్మిల ట్వీట్ చేశారు. 

తన ట్వీట్ తో పాటు నిశ్చితార్థ వేడుక గ్లింప్స్ వీడియోను కూడా పంచుకున్నారు.
YS Sharmila
Rajareddy
Atluri Priya
Engagement
Hyderabad
Congress
Andhra Pradesh

More Telugu News