Damodara Raja Narasimha: మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: దామోదర రాజనర్సింహ

Damodara Raja Narasimha review on medical colleges
  • సచివాలయంలో వైద్య అధికారులతో మంత్రి సమీక్ష
  • నాణ్యమైన ఎంసీహెచ్, న్యూట్రిషన్ కిట్స్‌లను కొనుగోలు చేయాలని సూచన
  • నిర్ణీత సమయానికి సరఫరా చేయాలన్న మంత్రి
మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని... వాటిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో నిర్మిస్తోన్న మెడికల్ కాలేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. నాణ్యమైన ఎంసీహెచ్, న్యూట్రిషన్ కిట్స్‌లను కొనుగోలు చేయాలన్నారు. వాటిని నిర్ణీత సమయానికి సరఫరా చేయాలన్నారు. టీఎస్ఎంఎస్‌ఐడీసీ ద్వారా నిర్మిస్తున్న వైద్య కళాశాలల భవనాల నిర్మాణం, నర్సింగ్ కాలేజీల నిర్మాణం, కళాశాలల సామర్థ్యం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
Damodara Raja Narasimha
Telangana
Congress

More Telugu News