ఆసుపత్రిలో తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన మల్లు భట్టివిక్రమార్క, పొంగులేటి

Ponguleti and Mallu Bhatti visits Tammineni Veerabhadram
  • మల్లు భట్టి, పొంగులేటితో పాటు కోమటిరెడ్డి తదితరుల పరామర్శ
  • సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలన్న భట్టి 
  • ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రులు
హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పలువురు మంత్రులు పరామర్శించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ఆయనను పరామర్శించారు. ఈ రోజు తమ్మినేనిని పరామర్శించిన అనంతరం మల్లు భట్టి మాట్లాడుతూ... సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

రెండు రోజుల క్రితం ఖమ్మంలోని నివాసంలో తమ్మినేని వీరభద్రం ఛాతినొప్పితో ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు రెండు రోజులుగా ఆసుపత్రి వర్గాలు చికిత్సను అందిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయనను పరామర్శిస్తున్నారు.
Go Back to Shorts
Tammineni veerabhadram
Telangana
Congress
Ponguleti Srinivas Reddy
Mallu Bhatti Vikramarka

More Telugu News