Indigo: విమానయాన సంస్థ ‘ఇండిగో’కి రూ.1.2 కోట్ల జరిమానా

  • ప్రయాణికులకు రన్‌వేపై భోజనం ఏర్పాటు చేయడంపై బీసీఏఎస్ సీరియస్
  • ముంబై ఎయిర్‌పోర్టుకి రూ.30 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
  • వైరల్ వీడియోపై సీరియస్ అయిన నియంత్రణ సంస్థలు

The airline company Indigo has been fined Rs 1 crore and 20 lakhs

ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) సీరియస్ అయ్యింది. ఈ నిర్వాకానికి పాల్పడిన దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు రూ.1.2 కోట్ల జరిమానా విధించింది. ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ని ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించడం జరిగింది. అక్కడ ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. 

ఈ సందర్భంగా ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్‌వేపై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే ముంబై ఎయిర్‌పోర్టుకి రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియోపై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

More Telugu News