Yarapathineni Srinivasa Rao: పోలీస్ వ్యవస్థని జగన్ భ్రష్టు పట్టించారు: యరపతినేని శ్రీనివాసరావు

  • జగన్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమయిందన్న యరపతినేని
  • రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శ
  • జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
Jagan spoiled police department says Yarapathineni Srinivasa Rao

చంద్రబాబు హయాంలో అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఏపీని సీఎం జగన్ సర్వనాశం చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. వ్యవసాయరంగం నిర్వీర్యమయిందని... పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను జగన్ ఏనాడూ పరామర్శించలేదని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టించారని, పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు తెచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంపై జగన్ కు నమ్మకం లేదని... రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 

ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టని వ్యక్తి జగన్ అని యరపతినేని విమర్శించారు. తనపై సాక్షి తప్పుడు వార్తలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను ఇంటికి పంపించేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని చెప్పారు.

More Telugu News