Siddharth Malhothra: అమెజాన్ ప్రైమ్ కి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'

Indian Police Force Web Series Streaming Date Confirmed
  • హిందీ వెబ్ సిరీస్ గా 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • ప్రధానమైన పాత్రల్లో సిద్ధార్థ్ మల్హోత్ర - శిల్పా శెట్టి
  • ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లోని వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్ సినిమాలతో సమానమైన తీరుగా ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లు రూపొందుతూ ఉండటమే అందుకు కారణం. అదే జోనర్లో అమెజాన్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' రెడీ అవుతోంది. 

రోహిత్ శెట్టి - సుశ్వంత్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి రోహిత్ శెట్టి నిర్మించారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా .. శిల్పా శెట్టి .. వివేక్ ఒబెరాయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ పై అందరిలో ఆసక్తి ఉంది. 

దేశ ప్రజలను రక్షించడం కోసం భారతీయ పోలీస్ అధికారులు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ప్రాణాలను పణంగా పెడుతూ ప్రమాదాలకు ఎదురువెళుతూ ఉంటారు. అలాంటి అధికారుల నిస్వార్థ సేవను ఆవిష్కరించే కథాంశంతో రూపొందినదే ఈ సిరీస్. లిజో జార్జ్ .. చేతస్ .. ఆకాశ్ దీప్ సంగీతాన్ని సమకూర్చారు. ముంబై .. మహారాష్ట్ర .. గోవా .. నోయిడా ప్రాంతాలలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

  • Loading...

More Telugu News