Revanth Reddy: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన షర్మిలకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Revanth Reddy Congratulates Sharmila for appointed as APPCC chief
  • వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కోసం దావోస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి
  • షర్మిలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
  • ఈ రోజే ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కోసం ఆయన దావోస్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన షర్మిలకు గ్రీటింగ్స్ చెబుతూ ట్వీట్ చేశారు. 'ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల గారికి శుభాకాంక్షలు.. ఆల్ ది వెరీ బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు.

ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజును సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. షర్మిలకు పగ్గాలు అప్పగిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
Revanth Reddy
YS Sharmila
Telangana

More Telugu News