KTR: జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు... శిక్షించాలని కేటీఆర్ డిమాండ్

Demand to take stern action on the perpetrator of this heinous act ktr tweet
  • మద్యం మత్తులో జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గోవింద్ 
  • నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలని డీజీపీకి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీలో 124 డివిజన్‌లో ఈ ఘటన జరిగింది. ఎల్లమ్మబండ మెయిన్‌ రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మహావీర్ కాలనీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంగళవారం ఉదయం ధ్వంసం చేశాడు. తొలుత విగ్రహాన్ని కిందపడేసి... ఆ తర్వాత ఓ రాయితో విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గోవింద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం ఘటనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎంతగానో గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
KTR
BRS
Police

More Telugu News