Uddhav Thackeray: స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉద్ధవ్ ఠాక్రే

  • ఏక్‌నాథ్ షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ అని స్పీకర్ నిర్ణయం
  • స్పీకర్ నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన ఠాక్రే
  • తమదే అసలైన శివసేన అని ఉద్ధవ్ ఠాక్రే వాదన
Uddhav Thackeray Approaches Court Over Speaker Real Shiv Sena Decision

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గమే నిజమైన శివసేన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ గతవారం వెలువరించిన నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమదే అసలైన శివసేన పార్టీ అంటూ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు వెళ్లారు. జూన్ 2022లో పార్టీ రెండుగా విడిపోయిన తర్వాత... రెండు వర్గాలు పరస్పరం అనర్హత నోటీసులు జారీ చేసుకున్నాయి. ఈ క్రమంలో గతవారం షిండే వర్గానిదే నిజమైన శివసేనగా స్పీకర్ ప్రకటించారు.

More Telugu News