Mayawati: లోక్ సభ ఎన్నికల్లో మేం ఒంటరిగానే పోటీ చేస్తాం: మాయావతి

  • ఎన్నికల తర్వాత పొత్తులను తోసిపుచ్చిన మాయావతి
  • పొత్తులతో వెళ్లిన ప్రతిసారీ తామే నష్టపోతున్నామన్న మాయావతి
  • రాజకీయాల నుంచి వైదొలుగుతాననే ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి
Mayawatis BSP to fight Lok Sabha election solo

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. పొత్తుల వల్ల తమ పార్టీకి ఎప్పుడూ ప్రయోజనం కనిపించలేదని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తులను మాత్రం ఆమె తోసిపుచ్చలేదు. లక్నోలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... పొత్తుల వల్ల తామే ఎక్కువగా నష్టపోతున్నామని తెలిపారు. దేశంలోని చాలా పార్టీలు తమ పార్టీతో పొత్తు కోసం ఆసక్తిగా ఉన్నాయని... కానీ తాము ఒంటరిగానే ముందుకు సాగుతామన్నారు. పొత్తుల గురించి ఆలోచించాల్సి వస్తే ఎన్నికల తర్వాత చూస్తామని స్పష్టం చేశారు.

ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మస్లింల మద్దతుతో ఉత్తరప్రదేశ్ లో తాము 2007లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. కులతత్వం, మతతత్వ పార్టీలకు తాము దూరంగా ఉంటామన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తన వారసుడిగా గత వారం ప్రకటించానని... అయితే ఈ ప్రకటన తర్వాత తాను రాజకీయాల నుంచి వైదొలుగుతాననే ప్రచారం సాగుతోందని... కానీ అందులో వాస్తవం లేదన్నారు.

More Telugu News