Hanuman: 'హనుమాన్' చిత్రం బ్లాక్ బస్టర్ అయినందుకు సంతోషంగా ఉంది: కె.రాఘవేంద్రరావు

Senior director K Raghavendra Rao appreciates Hanuman team
  • తేజ సజ్జా హీరోగా హనుమాన్
  • ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చిత్రం
  • సంక్రాంతి బరిలో సంచలన విజయం
  • చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన దర్శకేంద్రుడు
తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హనుమాన్' చిత్రం సంచలన విజయం అందుకుంది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పాటు బరిలో దిగిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు. 

సంక్రాంతి వేళ వచ్చిన 'హనుమాన్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమాలో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్ గా చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉన్నాయని రాఘవేంద్రరావు కొనియాడారు. సక్సెస్ అందుకున్న నేపథ్యంలో 'హనుమాన్' చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని వెల్లడించారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ దర్శకేంద్రుడు ట్వీట్ చేశారు.
Hanuman
K Raghavendra Rao
Teja Sajja
Prashant Varma

More Telugu News