Narendra Modi: పొంగల్ వేడుకలకు పంచెకట్టుతో హాజరైన ప్రధాని మోదీ.. ఫోటోలు ఇవిగో

  • కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో మోదీ ప్రత్యేక పూజలు
  • సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని
  • ఈ పండుగ ప్రజలందరికీ సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్ష
PM Modi attends Pongal celebrations

ఢిల్లీలో కేంద్రమంత్రి ఎల్.మురుగన్ నివాసంలో ఇవాళ పొంగల్ (తమిళ సంక్రాంతి) వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయన తమిళ సంప్రదాయాలను అనుసరించి పంచెకట్టులో రావడం విశేషం. కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో గోమాతకు పూలదండ వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అందరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరికీ సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, నటి మీనా కూడా పాల్గొన్నారు.

More Telugu News