నారావారిపల్లెలో మొదలైన సంక్రాంతి సందడి
- శుక్రవారం నారావారిపల్లెకు చేరుకున్న నారా, నందమూరి కుటుంబసభ్యులు
- శనివారం కల్యాణి జలాశయాన్ని సందర్శించిన వైనం
- నేడు మధ్యాహ్నం నారావారి పల్లెకు రానున్న చంద్రబాబు, సాయంత్రం లోకేశ్, బ్రాహ్మణి రాక
- సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు
కాగా, చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం హెలికాఫ్టర్లో అక్కడికి చేరుకుంటారని, అందుకోసం హెలిప్యాడ్ సిద్ధం చేశామని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పులివర్తి నాని పేర్కొన్నారు. సాయంత్రానికి లోకేశ్, బ్రాహ్మణి వస్తారని తెలిపారు. ఈసారి సందర్శకుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, ఇందుకు తగిన విధంగా భోజన, వసతి, వాహనాల పార్కింగ్ కోసం స్థల కేటాయింపుతో పాటూ అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తున్నట్టు వివరించారు.
శనివారం నారా, నందమూరి కుటుంబసభ్యులు గ్రామ సమీపంలోని కల్యాణి జలాశయానికి వెళ్లి గంటపాటు గడిపారు. కట్ట దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.