Harirama Jogaiah: పవన్ కల్యాణ్ కనీసం రెండున్నరేళ్లయినా సీఎంగా ఉండాలి: హరిరామజోగయ్య

Harirama Jogaiah letter on meeting with Pawan Kalyan
  • రెండ్రోజుల కిందట పవన్ ను కలిసిన హరిరామజోగయ్య
  • సమావేశం వివరాలపై హరిరామజోగయ్య లేఖ
  • కనీసం 60 సీట్లు తీసుకోవాలని పవన్ కు సూచించినట్టు వెల్లడి
  • 40 సీట్లకు ప్రయత్నిస్తామని పవన్ చెప్పారన్న హరిరామజోగయ్య

మాజీ మంత్రి, కాపు నేత హరిరామజోగయ్య రెండ్రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం వివరాలను హరిరామజోగయ్య లేఖ రూపంలో వెలువరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పానని తెలిపారు. 

పొత్తులో భాగంగా  40 నుంచి 60 సీట్లు తీసుకోవాలని పవన్ కల్యాణ్ కు సూచించానని హరిరామజోగయ్య పేర్కొన్నారు. 40 సీట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పవన్ చెప్పారని వెల్లడించారు. పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అభిమానులు, జనసైనికులు కోరుకుంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించానని తెలిపారు. 

వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే, అధికార పంపిణీ సవ్యంగా జరగాలని అభిలషించారు. పవన్ కల్యాణ్ కనీసం రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని, మిగతా రెండున్నరేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండేలా తాను ప్రతిపాదన చేశానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News