Ch Malla Reddy: 71 ఏళ్ల వయస్సులోనూ నేను ఎంత స్మార్ట్‌గా ఉన్నానో చూడండి: మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy distributes kites in Secunderabad
  • బోయినపల్లిలో చిన్నారులకు పతంగులు పంచిన మల్లారెడ్డి
  • పిల్లలతో కలిసి గాలి పటాలు ఎగురవేసిన మాజీ మంత్రి
  • గోవా వెళ్లి ఎంజాయ్ చేసినట్లు చెప్పిన మల్లారెడ్డి
  • అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి లోక్ సభ కు పోటీ చేస్తానని స్పష్టీకరణ
తనకు 71 ఏళ్లు ఉన్నప్పటికీ.. ఎంత స్మార్ట్‌గా ఉన్నానో చూడండని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా బోయినపల్లిలో బీఆర్ఎస్ నేతలు చిన్నారులకు పంతంగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి పిల్లలకు పతంగులను అందించారు. అంతేకాదు, పిల్లలతో కలిసి ఆయన గాలిపటాలను ఎగురవేసి సంబరపడ్డారు. అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... 

తాను గోవాకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లానని.. ప్యారాచూట్ అడ్వెంచర్ చేశానని... అండర్ వాటర్ సీలోకి వెళ్లానని... సముద్రంపై చక్కర్లు కొట్టానని... బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. తాను ఇలాగే మెయింటైన్ చేస్తానని.. అందరూ కూడా తనలా చేయాలని సూచించారు. మూడు పూటలు తిని.. నిమ్మలంగా పడుకోవడం కాదని.. ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. '71 ఏళ్ళు ఉన్నప్పటికీ... నేను ఎంత స్మార్ట్‌గా ఉన్నానో చూసుకోండి' అంటూ హుషారెత్తించారు. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలని సూచించారు. అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి తాను నిలబడతానని స్పష్టం చేశారు.
Ch Malla Reddy
Telangana
BRS
Makar Sankranti
Sankranti

More Telugu News