Chandrababu: ఈ రాత్రికి చంద్రబాబు, పవన్ డిన్నర్ మీట్.. రేపు భోగి వేడుకల్లో పాల్గొననున్న నేతలు

Chandrababu and Pawan Kalyan to paricipa
  • మందడంలో భోగి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్
  • ఉదయం 8 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో వేడుకలు
  • ప్రజా వ్యతిరేక జీవోలను మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయనున్న నేతలు
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి కళ వచ్చేసింది. నగరవాసులంతా పల్లె బాట పట్టారు. రేపు భోగి సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు భోగి మంటలు వేయనున్నారు. మరోవైపు అమరావతిలోని మందడంలో నిర్వహించనున్న భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి పాల్గొననున్నారు. రేపు ఉదయం 8 గంటలకు మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్ లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేసి నేతలు నిరసన వ్యక్తం చేయనున్నారు. 

మరోవైపు ఈ రాత్రికి చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ డిన్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. దాదాపు రెండు గంటల సేపు వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా వీరు చర్చించనున్నారు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి? అనే విషయంపై చర్చ జరపనున్నారు. 
Chandrababu
Telugudesam
Janasena
Pawan Kalyan
Bhogi

More Telugu News