Prabhas: కటీలు దుర్గా పరమేశ్వరిని దర్శించుకున్న అగ్రహీరో ప్రభాస్.. గుర్తుపట్టని అభిమానులు.. వీడియో ఇదిగో!

Tollywood top hero Prabhas visits Kateel Sri Durgaparameshwari Temple
  • దక్షిణ కన్నడ జిల్లాలోని కటీలులో కొలువైన అమ్మవారు
  • అమ్మవారి చిత్రాన్ని అందుకుంటున్న ప్రభాస్ ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు
  • సలార్ నిర్మాతతో కలిసి సందర్శన
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కటీలులో కొలువైన దుర్గా పరమేశ్వరి అమ్మవారిని టాలీవుడ్ స్టార్ నటుడు ప్రభాస్ నిన్న దర్శించుకున్నారు. మాస్క్ ధరించి వచ్చిన ఆయనను ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. సలార్ సినిమా నిర్మాత విజయ్ కిరంగదూరుతో కటీలు వచ్చిన ఆయన అమ్మవారిని సేవించుకున్నారు. ప్రభాస్‌కు ఆలయ ప్రతినిధులు అమ్మవారి పటాన్ని బహూకరించారు. ప్రభాస్ వెళ్లిపోయిన తర్వాత ఆలయ అధికారులు.. ప్రభాస్‌ అమ్మవారి చిత్రాన్ని అందుకుంటున్న ఫొటోను విడుదల చేశారు. అది చూసి అప్పటి వరకు అక్కడే ఉన్నవారు అయ్యో.. ఇప్పటి వరకు తమ పక్కన ఉన్నది ప్రభాసా? అని ఆశ్చర్యపోయారు. గుర్తుపట్టలేకపోయినందుకు చింతించారు.

ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ సుందరాంగులు దీపికా పదుకొణే, దిశా పఠానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు.  
Prabhas
Sri Durgaaparameshwari Temple
Kateel
Karnataka
Dakshin Kannada
Tollywood

More Telugu News