Pocharam Srinivas: కాళేశ్వరాన్ని పట్టుకొని ఎందుకు పాకులాడుతున్నారు... చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి: పోచారం

Pocharam Srinivas Reddy on Kaleswaram Project

  • కాళేశ్వరం నుంచి నీటి విడుదలపై కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచన
  • రైతుల గురించి కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని విమర్శ
  • రైతాంగాన్ని కాపాడాలన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసుకోవచ్చునని... దానిని స్వాగతిస్తామని బీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. కాళేశ్వరం అంశాన్ని పట్టుకొని కాంగ్రెస్ ఎందుకు పాకులాడుతోంది? ఇంత పెద్ద నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నుంచి నీటి విడుదలపై కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతోందని.. కానీ వారు కాళేశ్వరం గురించి తప్ప రైతుల గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

More Telugu News