పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. ప్రజాభవన్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
- ప్రతి నెల ఐదో తేదీ లోపు బిల్లులు, వేతనాలు చెల్లించాలని డిమాండ్
- పెంచిన రూ.3వేలను వెంటనే అమలు చేయాలన్న మధ్యాహ్న భోజన కార్మికులు
- జీవో 46ను రద్దు చేయాలంటూ నిరుద్యోగుల నిరసన
ప్రతి నెల పదో తేదీ లోపే మెస్ బిల్లులు, వేతనాల చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు రూ.3వేల వేతనం పెంచారని... దీనిని వెంటనే అమలు చేయాలన్నారు. మరోవైపు జీవో 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు ప్రజాభవన్ వద్ద నిరసన తెలిపారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.