Amazon Great Republic Day Sale 2024: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024.. పలు బ్రాండ్లపై డిస్కౌంట్లు.. మోటరోలా రేజర్ 40 అల్ట్రాపై రూ. 50 వేల రాయితీ!

  • శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీపై రూ. 35 వేల డిస్కౌంట్
  • ఆఫర్ల హోరెత్తిస్తున్న అమెజాన్
  • 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్
  • ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందుగానే
  • ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆకర్షణీయ డిస్కౌంట్లు
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, తక్షణ రాయితీలు అదనం
Amazon Great Republic Day Sale 2024 will live from 13th January

మరో రెండు రోజుల్లో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కాబోతోంది. స్మార్ట్‌ఫోన్లు, పీసీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి మరెన్నో ఎలక్ట్రానిక్ వస్తువులపై ఊహించని ఆఫర్లతో వచ్చేస్తున్న ఈ సేల్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధరల తగ్గింపునకు తోడుగా బ్యాంకు ఆఫర్లు, రాయితీలు వంటివి విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుండగా, ప్రైమ్ యూజర్లకు మాత్రం 12 గంటల ముందుగానే అంటే.. 12న అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ లైవ్‌లోకి వస్తుంది. మరో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహా మరిన్ని సంస్థలు 14 నుంచి రిపబ్లిక్ డే సేల్ మొదలు పెడుతున్నాయి. 

సేల్‌లో భాగంగా కొన్ని ఉత్పత్తులపై రూ.1,499తో నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. పలు స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. 

ఈ రాయితీలపై ఓ లుక్కేసుకోండి

ఉత్పత్తిఅసలు ధర (రూపాయిల్లో)రాయితీ
మోటరోలా రేజర్ 40 అల్ట్రా
1,19,999 
 69,999 
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ89,999 
54,999 
ఐఫోన్ 13 
59,900 
48,999 
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ 39,999 
 38,999 
ఆనర్ 90 5జీ 
47,999 
 25,999 
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ 19,999 
17,999 
రెడ్‌మీ నోట్ 13 5జీ 17,999 
16,999 
రెడ్‌మీ 12 5జీ12,999 
11,999 
రియల్‌మీ నార్జో 6060x 5జీ 12,99911,499
ఐటెల్ ఏ70 9,9996,119
టెక్నోపాప్7,9995,849

 

More Telugu News