Seethakka: ప్రజలతో కలిసి భోజనం చేసి... రోడ్డుపై మొక్క జొన్న కంకిని కొనుక్కొని తిన్న మంత్రి సీతక్క

  • ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవాయి ప్రాంతాల్లో పర్యటించిన సీతక్క
  • మార్లవాయిలో గ్రామస్తులతో కలిసి భోజనం చేసిన మంత్రి   
  • ఉడుంపూర్ వద్ద ఆగి రోడ్డుపై మొక్కజొన్న కంకి కొనుక్కున్న సీతక్క
Minister Seethakka simplicity in Adilabad district

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క నిరాడంబరత అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె కుమురం బీమ్ అసిఫాబాద్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేశారు. రోడ్డుపై మొక్క జొన్న కంకులను కొనుక్కొని తిన్నారు. ఆమె ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవాయి ప్రాంతాల్లో ఈ రోజు పర్యటించారు. మార్లవాయి గ్రామస్తులతో కలిసి... ఆమె నేలపై కూర్చొని భోజనం చేశారు. అంతకుముందు కడెం నుంచి మార్లవాయికి వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో ఉడుంపూర్ వద్ద ఆగి రోడ్డుపై మొక్కజొన్న కంకులు అమ్ముతున్న మహిళ వద్దకు వెళ్లి వాటిని కొనుగోలు చేసి తిన్నారు. మొక్క జొన్న కంకులు తియ్యగా ఉన్నాయని.. అన్నీ ఇచ్చెయ్.. పైసల్ ఇస్తానని ఆ మహిళ వద్ద మొత్తం కంకులను కొనుగోలు చేశారు.

ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో పర్యటన

సీతక్క నిన్న ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్ ఘాట్ కాల్వను ఎమ్మెల్యే వెడ్మ బోజ్యతో కలిసి పరిశీలించారు. ఖానాపూర్ రైతులకు సదర్ ఘాట్ కాల్వ నుంచి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మల్‌లోని కడెం ప్రాజెక్టును పరిశీలించారు. మార్లవాయిలో 18 లక్షల వ్యయంతో నిర్మించిన హైమన్ డార్ఫ్ మ్యూజియంను ప్రారంభించారు. డార్ఫ్ స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

More Telugu News