జూపల్లి రామేశ్వరరావుకు వివాహ ఆహ్వాన పత్రికను అందించిన వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల గురువారం ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావును కలిసి తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించారు. వచ్చే నెలలో తనయుడి పెళ్లి ఉన్నందున షర్మిల పలువురు ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. ఈ క్రమంలో నేడు మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు దంపతులను... హైదరాబాదులోని వారి నివాసంలో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఈ నెల 18న రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన పెళ్లి జరగనున్నాయి.


More Telugu News