Atal Setu: ఈ ఫొటోలకు క్యాప్షన్ అక్కర్లేదు.. అటల్ సేతు ఫొటోలతో ఆనంద్ మహీంద్ర ట్వీట్

Anand Mahindra shares Indias Longest Sea Bridge pics
  • ప్రారంభోత్సవానికి సిద్ధమైన అటల్ సేతు బ్రిడ్జి
  • దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డు
  • శుక్రవారం ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • బైక్ లు, ఆటోలకు నో ఎంట్రీ, గరిష్ఠంగా 100 కి.మీ. స్పీడ్
దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డు నమోదు చేసుకున్న అటల్ సేతు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెట్టిన ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (హెచ్ టీఎంఎల్) ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ వేడుక కోసం బ్రిడ్జిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రిపూట విద్యుత్ దీపాల కాంతితో మిరుమిట్లు గొలుపుతున్న అటల్ సేతు ఫొటోలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పంచుకున్నారు. క్యాప్షన్ అక్కర్లేని, వర్ణించేందుకు పదాలు లేని ఫొటోలంటూ కామెంట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అటల్ సేతుపైకి ఆటోలకు, బైక్ లకు ఎంట్రీ లేదని ముంబై పోలీసులు వివరించారు. ఈ బ్రిడ్జిపై వాహనాల వేగాన్ని గరిష్ఠంగా 100 కిలోమీటర్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బ్రిడ్జి పైకి వెళ్లేందుకు, కిందికి దిగేందుకు ఏర్పాటు చేసిన మార్గాల వద్ద మాత్రం వాహనాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని సూచించారు. బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతో ఈ రూల్స్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

బ్రిడ్జి విశేషాలు..
  • దక్షిణ ముంబైని నవీ ముంబైతో కలుపుతూ 21.8 కిలోమీటర్ల పొడువుతో నిర్మాణం
  • ఈ మార్గంలో దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు
  • గతంలో ఇదే దూరానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది
  • ఆరు లేన్లతో సముద్రంపై 16.5 కి.మీ. నేలపై 5.3 కి.మీ. ఏర్పాటు
  • 2018లో నిర్మాణ పనులు ప్రారంభం
  • బ్రిడ్జి నిర్మాణానికి రూ.18 వేల కోట్ల ఖర్చు
Atal Setu
HTML
Harbour Link
Mumbai
Longest Bridge
Inauguration
Modi
Bikes Autos
NO Entry

More Telugu News