PVP: వైసీపీ నేత పీవీపీ వ్యంగ్యాస్త్రాలు.. కేశినేని నానిపైనేనా?

YCP leader PVP satires on Kesineni Nani after Nani meets Jagan
  • టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి దగ్గరైన కేశినేని 
  • ఆయన బుద్ధి గురించి బెజవాడ మొత్తం తెలుసంటూ పీవీపీ పరోక్ష వ్యాఖ్యలు
  • వైరల్ అవుతున్న వ్యంగ్యాస్త్రాలు
ఎన్నికల ముందు ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడ రాజకీయం హీటెక్కిస్తోంది. కేశినేని నాని, ఆయన కుమార్తె టీడీపీకి గుడ్‌బై చెప్పడం, ఆ తర్వాత వైసీపీకి దగ్గర కావడం వంటి పరిణామాలు చకచకా చోటుచేసుకుంటున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ తనకు విపరీతంగా నచ్చేశారని, త్వరలోనే వైసీపీలో చేరుతున్నానని కేశినేని నాని చేసిన ప్రకటన నేపథ్యంలో వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ‘‘బోరుకొచ్చిన బండి షెడ్డుమారిందంతే.. వీడి గుడిసేటి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు కేశినేని నానిని ఉద్దేశించి చేసినవే అంటూ కామెంట్లు వస్తున్నాయి.
PVP
Kesineni Nani
YSRCP
Vijayawada

More Telugu News