Hema Malini: నీకు సెల్ఫీలు ఇవ్వడానికి రాలేదు.. అభిమానిపై హేమమాలిని మండిపాటు!

Netizens fires on Bollywood senior actress Hema Malini
  • గుల్జార్ బయోగ్రఫీ ఆవిష్కరణకు వచ్చిన హేమ 
  • అభిమానతారను సెల్ఫీ అడిగిన వ్యక్తి 
  • అవమానకరంగా మాట్లాడిన హేమ 
  • విరుచుకుపడుతున్న నెటిజన్లు
అభిమాన సినీతారలు కనిపిస్తే వారితో ఒక సెల్ఫీ తీసుకోవాలని, ఆ ఆనందాన్ని పదిలపరుచుకోవాలని అభిమానులు భావిస్తూ ఉంటారు. అచ్చం అలాగే ఆలోచించిన ఓ అభిమానితో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని అవమానించేలా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. తానేమీ సెల్ఫీలు ఇచ్చేందుకు రాలేదన్న ఆమె సమాధానం విని సెల్ఫీ తీసుకోవాలన్న అభిమాని ముఖం కందిపోయింది.

ప్రముఖ గేయరచయిత గుల్జార్ బయోగ్రఫీ ‘గుల్జార్ ‌సాబ్: హాజర్ రహే మడ్‌కే దేఖిన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హేమమాలిని హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్ఫీ అడిగిన అభిమానితో ఆమె ప్రవర్తించిన తీరు నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఆనందంగా సెల్ఫీ అడిగిన అభిమానితో ఇలా దురుసగా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Hema Malini
Bollywood
Selfie With Hema

More Telugu News