Revanth Reddy: ఆ పోస్టర్‌ను తన కారుకు స్వయంగా అంటించుకున్న సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy pasts Rahul Gandhi Nyay Yatra poster to his car
  • ఈ నెల 14వ తేదీ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
  • గాయపడ్డ మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ యాత్రకు సిద్ధమవుతున్నారన్న రేవంత్ రెడ్డి
  • యాత్రా పోస్టర్‌ను నేనే స్వయంగా అతికించుకొని కార్యకర్తలకు కర్తవ్య బోధ చేస్తున్నానని పేర్కొన్న సీఎం
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14వ తేదీ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో వాహన పోస్టర్లు కూడా ఉన్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పోస్టర్లను స్వయంగా తన వాహనానికి అంటించుకున్నారు. అంతేకాదు.. నేనే స్వయంగా నా కారుకు పోస్టర్ అంటించుకున్నానని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

"ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్‌గా తెలిపేందుకు యాత్ర పోస్టర్‌ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను." అని పేర్కొన్నారు.
Revanth Reddy
car
Rahul Gandhi
Congress

More Telugu News