Kesineni Nani: రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పంచుకున్న కేశినేని నాని

Kesineni Nani sent resignation letter to Lok Sabha speaker
  • టీడీపీకి గుడ్ బై చెప్పిన కేశినేని నాని
  • నేడు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
  • రాజీనామా లేఖను ఈ-మెయిల్ లో పంపిన నాని
  • తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్ కు విజ్ఞప్తి
విజయవాడ ఎంపీ కేశినేని నాని లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మధ్యాహ్నం సీఎం జగన్ ను కలిసిన కేశినేని నాని... అనంతరం తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ కు ఈ-మెయిల్ ద్వారా పంపించారు. ఈ విషయాన్ని నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

"విజయవాడ ఎంపీగా నా పదవికి రాజీనామా చేశాను. రాజీనామా లేఖను గౌరవనీయ లోక్ సభ స్పీకర్ కు ఈ-మెయిల్ చేశాను. తక్షణమే నా రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశాను" అంటూ కేశినేని నాని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, తన రాజీనామా లేఖను కూడా పంచుకున్నారు. కాగా, కేశినేని నాని ఒకట్రెండు రోజుల్లో వైసీపీలో చేరే అవకాశాలున్నాయి.
Kesineni Nani
Resignation
Lok Sabha Speaker
Vijayawada
YSRCP
TDP

More Telugu News