Prabhas: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ విడుదల మళ్లీ వాయిదా?

Prabhas starer Kalki 2898 AD release postponed again saying reports
  • జనవరిలో విడుదల కావాల్సిన మూవీ మరోసారి వాయిదాపడిందంటూ వార్తలు 
  • సలార్ సక్సెస్‌పై ప్రభావం చూపుతుందని ప్రభాస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా పేర్కొన్న ‘టైమ్స్ నౌ’ రిపోర్టు
  • మార్చి లేదా ఏప్రిల్ నెలలో విడుదల కోసం తేదీలను నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు వెల్లడి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఈ జనవరిలోనే థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇందుకు హీరో ప్రభాస్ అభ్యంతరమే కారణమని ‘టైమ్స్ నౌ’ రిపోర్టు పేర్కొంది. 

సలార్ సినిమా విడుదలై ఎక్కువ రోజులు కాలేదని, తక్కువ వ్యవధిలోనే ‘కల్కి 2898 ఏడీ’ని విడుదల చేస్తే సలార్‌పై ప్రభావం చూపుతుందని ప్రభాస్ ఆందోళన చెందుతున్నట్టు ఆ రిపోర్ట్ తెలిపింది. సలార్ సక్సెస్‌పై ఎలాంటి ప్రభావం పడకూడదంటే కాస్త గ్యాప్ తీసుకొని ‘కల్కి 2898 ఏడీ’ను విడుదల చేయడం మంచిదని ప్రభాస్ సూచించినట్టు తెలుస్తోంది. దీంతో మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో సినిమా విడుదల కోసం తగిన తేదీలను చిత్ర నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు రిపోర్ట్ పేర్కొంది.

కాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ నిర్మించింది. ఇక దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్‌, దిశా పఠానీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Prabhas
Kalki 2898 AD
Kalki 2898 AD release
movie news
Tollywood
Bollywood

More Telugu News