Revanth Reddy: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారు

CM Revanth Reddy to visit Davos this month
  • దావోస్, లండన్‌లలో పర్యటించనున్న ముఖ్యమంత్రి
  • ముఖ్యమంత్రి హోదాలో తొలి విదేశీ పర్యటన
  • రేవంత్ రెడ్డితో పాటు వెళ్లనున్న మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆయన విదేశాలలో పర్యటించనున్నారు. దావోస్, లండన్‌లలో ఆయన పర్యటిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు. దావోస్ సదస్సులో భాగంగా ప్రముఖ ప్రపంచ కంపెనీలకు చెందిన సీఈవోలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News