Nara Lokesh: ఏసీబీ కోర్టులో నారా లోకేశ్ పై సీఐడీ పిటిషన్.... విచారణ వాయిదా

  • రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరిస్తున్నారన్న సీఐడీ
  • గత నెలలో పిటిషన్... లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని వినతి
  • నేడు విచారణ కొనసాగింపు
  • తాము నోటీసులు పంపిస్తామన్న ఏసీబీ కోర్టు
ACB Court adjourns hearing of CID petition on Nara Lokesh

రెడ్ బుక్ అంశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరిగింది.

నారా లోకేశ్ తన ప్రసంగాల్లో రెడ్ బుక్ అంశం ప్రస్తావనకు తెస్తుండడం పట్ల సీఐడీ గత నెలలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఐడీ వివరించింది. లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. దీనిపై డిసెంబరు 28న విచారణ జరగ్గా, జనవరి 9కి వాయిదా పడింది. 

నేటి విచారణ సందర్భంగా... వాట్సాప్ ద్వారా లోకేశ్ కు నోటీసులు పంపినట్టు సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోస్ట్ ద్వారా పంపిస్తే అందుబాటులో లేరని, ఆ నోటీసులు రిటర్న్ అయినట్టు వివరించారు. దాంతో, కోర్టు ద్వారా నోటీసులు పంపుతామని ఏసీబీ కోర్టు పేర్కొంది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది.

More Telugu News