Stock Market: మార్కెట్లను వెనక్కి లాగిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్

  • 31 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 32 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఒకానొక సమయంలో 72 వేల పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 71,386కు చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 21,545 వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈరోజు భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభమయింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 72,035 పాయింట్లను టచ్ చేసింది. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టపోవడం మార్కెట్లపై ప్రభావం చూపాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (1.55%), భారతి ఎయిర్ టెల్ (1.50%), టాటా మోటార్స్ (1.32%), సన్ ఫార్మా (1.25%), టాటా స్టీల్ (1.21%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.03%), ఏసియన్ పెయింట్స్ (-0.90%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.88%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.80%), యాక్సిస్ బ్యాంక్ (-0.57%).

More Telugu News