Income Tax: పన్ను ఎగవేత ఆరోపణలు... హైదరాబాద్‌లో ఫార్మా యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

IT offiials searches in Pharma owener house
  • మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోన్న ఐటీ అధికారులు
  • బృందాలుగా విడిపోయి రాయదుర్గం, కోకాపేట్ తదితర ప్రాంతాల్లో సోదాలు
  • ఫార్మా కంపెనీ యజమానితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు

హైదరాబాద్‌లో ఓ ఫార్మా కంపెనీ యజమాని ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల నివాసాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు... మంగళవారం ఉదయం నుంచి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట్, మొయినాబాద్ ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో సదరు ఫార్మా కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది.

  • Loading...

More Telugu News