Ntr: లైక్స్ ప్రవాహం .. దూసుకుపోతున్న 'దేవర' గ్లింప్స్!

  • ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'దేవర'
  • ఆయన జోడీగా కనువిందుచేయనున్న జాన్వీ కపూర్ 
  • హైలైట్ గా నిలవనున్న యాక్షన్ సీన్స్ 
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్ 

Devara Movie Update

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా రూపొందుతోంది. 'ఆర్ ఆర్ ఆర్ ' తరువాత ఎన్టీఆర్ నుంచి రానున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఎన్టీఆర్ కెరియర్లో 'ఆర్ ఆర్ ఆర్' తరువాత అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. అందువలన ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పాత్రను ప్రధానంగా చేసుకుని వదిలిన గ్లింప్స్ ఇది. 

ఇలా యూట్యూబ్ లో వదిలిన మరుక్షణమే ఈ గ్లింప్స్ దూసుకుపోవడం మొదలుపెట్టింది. వ్యూస్ పరంగా చూసుకుంటే చకచకా అంకెలు మారిపోతున్నాయి. ఇక లైక్స్ ప్రవాహంలో ఈ గ్లింప్స్ తేలుతోంది. 1 మిలియన్ ప్లస్ లైక్స్ ను రాబట్టుకుంది.  సముద్రపు దొంగలు ఎటాక్ చేయడం .. వాళ్లపై కథానాయకుడు విరుచుకుపడటం ఈ గ్లింప్స్ లో చూపించారు. వెన్నెల రాత్రిలో కథానాయకుడిపై చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. చివర్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కంటెంట్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

సముద్రం నేపథ్యంలో జరిగే ఈ కథలో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ అలరించనుంది. ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఆయన విలనిజాన్ని కొరటాల డిజైన్ చేసిన తీరు గొప్పగా ఉందనే టాక్ వినిపిస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ .. లవ్ .. రొమాన్స్ ను కోలుకుంటూ నడిచే ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమనే నమ్మకంతో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు

More Telugu News